Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4981 కరోనా కేసులు, 38మంది మృతి

Corona Cases in AP: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతూ ఉన్నాయి.

Arun Chilukuri
Published on: 24 Jun 2021 4:50 PM IST
4981 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 24 06 2021
X

ఏపీలో కొత్తగా 4981 కరోనా కేసులు, 38మంది మృతి

Corona Cases in AP: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతూ ఉన్నాయి. గతంతో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ కొద్దిరోజులుగా ఐదు వేల్లోపు కేసులు నమోదవుతున్నాయి. గత 24గంటల్లో 88వేల 622 పరీక్షలు నిర్వహించగా, 4వేల 981మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఇక, కొత్తగా 38మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దాంతో, రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ‌్య 12వేల 490కి పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 49వేల 683 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

ఇదిలాఉంటే, గత 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో 10మంది మరణించగా తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృత్యువాత పడ్డారు. అలాగే, అనంతపురం, కడప, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story