AP Corona Cases: గడిచిన 24గంటల్లో 4,872 మందికి వైరస్

AP Corona Cases: 17,63,211కి చేరిన కరోనా కేసుల సంఖ్య

Sandeep Eggoju
Updated on: 7 Jun 2021 6:21 PM IST
4,872 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 07 06 2021
X

Representational Image

AP Corona Cases: ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 64 వేల 800 శాంపిల్స్ పరీక్షించగా.. వారిలో 4వేల 872 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 17 లక్షలు దాటింది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 13వేల 702 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 16 లక్షలు దాటింది. చిత్తూరులో అత్యధికంగా 961 మందికి కరోనా సోకింది. తూర్పుగోదావరిలో 810, అనంతపురంలో 535, కడప 404, నెల్లూరు 232, ప్రకాశం 447, చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఏపీలో రోజువారీ కేసులు తగ్గుతున్నా మృత్యుఘోష మాత్రం ఆగడం లేదు. రోజుకు 80 మంది చొప్పున మరణాలు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 86 మంది మృతి చెందారు. చిత్తూరులో 13మంది, గుంటూరులో 10, అనంతపురం, శ్రీకాకుంళం 9, విజయనగరం, పశ్చిమగోదావరి 7, ప్రకాశం, విశాఖలో ఆరుగురు, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు ఐదుగురు, నెల్లూరులో నలుగురు చొప్పున మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 14వేల 510 యాక్టివ్ కేసులున్నట్లు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు కోటి 98లక్షల శాంపిల్స్ పరీక్షించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story