Corona Cases In AP: కొత్తగా 4,684 మందికి కరోనా పాజిటివ్‌

Corona Cases In AP: గడిచిన 24గంటల్లో 36 మంది మృతి * ఇప్పటివరకు కరోనాతో 12,452మంది మృతి

Sandeep Eggoju
Published on: 23 Jun 2021 5:46 PM IST
4,684 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 23 06 2021
X

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

Corona Cases In AP: ఏపీలో కరోనా కేసులు గతంతో పోలిస్తే బాగా తగ్గాయి. కొత్తగా 80వేల 172 మందికి పరీక్షలు నిర్వహించగా.. 4వేల 684మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గడిచిన 24గంటల్లో కోవిడ్‌ బారిన పడి 36 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 8వేల 324 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 18లక్షల 62వేల 36మందికి కరోనా సోకగా వైరస్‌ నుంచి కోలుకుని 17లక్షల 98వేల 380 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 12వేల 452 మంది మృతిచెందగా.. ఏపీలో ప్రస్తుతం 51వేల 2వందల 4 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

అయితే నిన్నటితో పోల్చితే మరణాల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న 53 మంది బలైతే గడిచిన 24 గంటల్లో 36 మంది ప్రాణాలు వదిలారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపూర్, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు చొప్పన కరోనాతో బలయ్యారు. ఇక కర్నూల్‌, ప్రకాశం, విశాఖ జిల్లాలో ఇద్దరు చొప్పున, మృతిచెందారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story