ఏపీలో కొత్తగా 4,622 పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 13 Oct 2020 6:35 PM IST
ఏపీలో కొత్తగా 4,622 పాజిటివ్ కేసులు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 4,622 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 72,082 శాంపిల్స్‌ని పరీక్షించగా 4,622 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 5,715 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో 7 మంది, కృష్ణా 5, కడప 4, ప్రకాశం 4, అనంతపురం 3, గుంటూరు 3, విశాఖపట్నం 3, తూర్పుగోదావరి 2, నెల్లూరు 2, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 7,60,678. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 6291. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,11,532కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 42,855 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 67,02,810 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story