4.55 లక్షల సమస్యల పరిష్కారం

4.55 లక్షల సమస్యల పరిష్కారం
x
Highlights

గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ వరకు గ్రీవెన్స్ సెల్ కు 5,28,217 ఫిర్యాదులు రాగా, వీటిలో 4,55,189 సమస్యలు పరిష్కరించినట్లు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

అమరావతి : గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ వరకు గ్రీవెన్స్ సెల్ కు 5,28,217 ఫిర్యాదులు రాగా, వీటిలో 4,55,189 సమస్యలు పరిష్కరించినట్లు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పరిశీలనలో మరో 73 వేల సమస్యలు ఉన్నట్లు చెప్పారు. రెవెన్యూ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. పీజీఆర్ఎస్ సహా 22ఏ, ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూములు, రీ సర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు... తదితర అంశాలను సమీక్షించారు. పాలనా సంస్కరణలతో ఆటోమ్యూటేషన్ ప్రక్రియ ఈ ఏడాది జూన్ నుంచి వేగవంతమైనట్లు అధికారులు చెప్పారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 22ఏ జాబితా నుంచి తమ భూములను తప్పించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తులు 6,846 ఉన్నట్లు వివరించారు. ఎక్స్ సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములు 22ఏ నుంచి తొలిగించారు. 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. వెబ్ ల్యాండ్ 2.0లో వివరాల నమోదు చేశారు. రీసర్వేలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా భూమి రికార్డుల అప్‌గ్రెడేషన్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాల పున: పరిశీలన చేశారు. 2.77 కోట్ల కుల ధృవీకరణ పత్రాలు ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఈ ఆర్ధిక సంవత్సరం స్టాంప్, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.10,169 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 430 రియల్ ఎస్టేట్ వెంచర్లను గుర్తించి, ఆయా ప్లాట్లకు సంబంధించి యూజర్ ఫ్రెండ్లీ రిజిస్టేషన్‌కు కార్యాచరణ రూపొందించారు. దీంతో 15,570 రిజిస్ట్రేషన్లతో రూ.250 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ అధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories