Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4,458 కరోనా కేసులు, 38మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది.

Arun Chilukuri
Published on: 25 Jun 2021 5:50 PM IST
4,458 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 25 06 2021
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4,458 కరోనా కేసులు, 38మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. గతంతో పోలిస్తే రోజువారీ కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాలు తగ్గాయి. గత 24గంటల్లో 91వేల 849 పరీక్షలు చేయగా 4వేల 458 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇక కొత్తగా 38మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దాంతో, రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ‌్య 12వేల 528కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18లక్షల 71వేల 475కి చేరగా ఇప్పటివరకు కోవిడ్‌ నుంచి 18లక్షల 11వేల 157 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 47వేల 790 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

ఇక గడిచిన 24గంటల్లో కరోనా మహమ్మారితో రాష్ట్రవ్యాప్తంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 9 మంది మృత్యువాత పడగా కృష్ణా జిల్లాలో 8మంది మృతి చెందారు. గుంటూరులో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story