Corona Cases in AP: కొత్తగా 4,169 మందికి కరోనా పాజిటివ్‌

Corona Cases in AP: గడిచిన 24గంటల్లో 53 మంది మృతి * రాష్ట్రంలో 18,54,457కి చేరిన పాజిటివ్‌ కేసులు

Sandeep Eggoju
Updated on: 22 Jun 2021 5:39 PM IST
4,169 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 22 06 2021
X
ప్రతికత్మక చిత్రం 

Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు గతంతో పోలిస్తే బాగా తగ్గాయి. కొత్తగా 74వేల 453 మందికి పరీక్షలు నిర్వహించగా.. 4వేల 169 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇక.. గడిచిన 24గంటల్లో కోవిడ్‌ బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా 53 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 8వేల 376 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 18లక్షల 54వేల 457 మందికి కరోనా సోకగా.. వైరస్‌ నుంచి కోలుకుని 17లక్షల 88వేల 161 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 12వేల 416 మంది మృతిచెందగా.. ఏపీలో ప్రస్తుతం 53వేల 880 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరోవైపు.. రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల సంఖ్య కాస్త.. ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో వైరస్‌ సోకి 53 మంది మృతి చెందగా.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృత్యువాత పడ్డారు. అనంతపురం, కడప, నెల్లూరులో నలుగురు చొప్పున, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, గుంటూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతిచెందారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story