AP Corona Cases: ఏపీలో కొత్తగా 4,157 కరోనా కేసులు, 18 మంది మృతి

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.

Arun Chilukuri
Published on: 14 April 2021 4:34 PM IST
4,157 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 14th April 2021
X

AP Corona Cases: ఏపీలో కొత్తగా 4,157 కరోనా కేసులు, 18 మంది మృతి

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. నిన్నమొన్నటివరకు రెండు-మూడు వేలు మాత్రమే నమోదైన రోజువారీ కేసులు ఇఫ్పుడు ఏకంగా 4వేలు దాటేస్తున్నాయి. గత 24గంటల్లో 35వేల 732మందికి పరీక్షలు నిర్వహించగా 4157మందికి వైరస్ సోకింది. రోజువారీ కేసులతోపాటు యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28వేల 383 ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇక, గత 24గంటల్లో 18మంది మృత్యువాత పడ్డారు.

ఇక, అనంతపురంలో 297, చిత్తూరులో 517, తూర్పుగోదావరిలో 617, గుంటూరులో 434, కడపలో 112, కృష్ణాలో 135, కర్నూలులో 386, నెల్లూరులో 276, ప్రకాశంలో 230, శ్రీకాకుళంలో 522, విజయనగరంలో 417, పశ్చిమగోదావరిలో 60 కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో నలుగురు చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున కరోనాతో మరణించారు. అలాగే విశాఖలో ఇద్దరు అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story