Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4,147 కరోనా కేసులు, 38 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది.

Arun Chilukuri
Updated on: 26 Jun 2021 5:58 PM IST
4,147 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 26 06 2021
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4,147 కరోనా కేసులు, 38మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. గతంతో పోలిస్తే రోజువారీ కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాలు తగ్గాయి. గత 24గంటల్లో 96వేల 121 పరీక్షలు చేయగా 4వేల 417 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇక కొత్తగా 38మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 5,773 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 18,75,622కి చేరగా, కరోనాతో 12,566 మంది మృతి చెందారు. అలాగే 46,126 యాక్టివ్‌ కేసులు ఉండగా, 18,16,930 మంది రికవరీ అయ్యారు.

24 గంటల్లో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందగా, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి ప్రాణాలు కోల్పోయారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 4, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, అనంతపురం, కడప, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కొత్తగా విజయనగరం జిల్లాలో కొవిడ్‌తో ఒకరు మృతి చెందారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story