YS Jagan Padayatra: ప్రజా సంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తి

YS Jagan Padayatra: ప్రజా సంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తి
YS Jagan Padayatra: *2017 నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభం.. *14 నెలల పాటు 3,648 కి.మీ. పాదయాత్ర చేసిన జగన్..
YS Jagan Padayatra: వైసీపీ అధినేత పాదయాత్ర చేపట్టి నేటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీకి అధికారాన్ని తెచ్చిన పాదయాత్ర అది. ప్రజా సంకల్పయాత్ర అంటూ ఉక్కు సంకల్పంతో జగన్ చేసిన పాదయాత్ర ఓ చరిత్ర అనే చెప్పాలి. అలాంటి పాదయాత్ర ప్రారంభించిన ఈరోజును పండుగలా జరుపుకుంటోంది వైసీపీ.
2017 నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్రని ప్రారంభించారు సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 13 జిల్లాలను టచ్ చేస్తూ పాదయాత్ర చేశారు. 134 నియోజవర్గాల్లో 3వందల 41 రోజుల పాటు పాదయాత్ర చేసిన జగన్.. 3వేల 6వందల 48 కిలోమీటర్లు నడిచారు. 2వేల 5వందల 16 గ్రామాల్లో జగన్ పాదయాత్ర సాగింది. మొత్తం 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమవేశాలతో పాదయాత్ర చేశారు జగన్.
జగన్ పాదయాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను గుర్తుచేసే విధంగా పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైసీపీ అధిష్టానం. ఇందులో భాగంగా నాటి పాదయాత్ర అనుభవాలనే మేనిఫెస్టోగా మలచుకుని అధికారం చేపట్టిన తర్వాత అందులో 97 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారు అనే విషయాన్ని ప్రజలకు తెలిపే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
అంతేకాకుండా ప్రతీ నియోజకవర్గంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించడం, సర్వమత ప్రార్ధనలు, కేక్ కటింగ్ తో పాటు ఆయా నియోజకవర్గంలో పాదయాత్ర చేసేలా సూచనలు ఇచ్చింది పార్టీ.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT