ఏపీలో కొత్తగా 3,967 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 16 Oct 2020 8:01 PM IST
ఏపీలో కొత్తగా 3,967 కరోనా పాజిటివ్ కేసులు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,967 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 74,337 శాంపిల్స్‌ని పరీక్షించగా 3,967 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 5,010 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. కడప, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరిలో ఇద్దరు మృతి చెందారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,75,470కి చేరింది. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 6,382కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,30,109కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 38,979 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 69,20,377 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story