ఏపీలో కొత్తగా 381 పాజిటివ్ కేసులు

X
Highlights
ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయ్. కొత్తగా 40వేల 7వందలకు పైగా పరీక్షలు నిర్వహించగా 381 పాజిటివ్...
Arun Chilukuri30 Nov 2020 4:30 PM GMT
ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయ్. కొత్తగా 40వేల 7వందలకు పైగా పరీక్షలు నిర్వహించగా 381 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 74... అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 7 కేసులు వెలుగుచూశాయ్. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 868064కి చేరుకుంది.
గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకుని 934 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,53,232 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి అనంతపురం,చిత్తూరు, కృష్ణా,విశాఖపట్నంలో ఒక్కరి చొప్పున మొత్తం నలుగురు మృతిచెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6992కి చేరుకుంది. ప్రస్తుతంలో ఏపీలో 7,840 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Web Title381 new coronavirus cases reported in Andhra Pradesh
Next Story