Corona Cases in AP: ఏపీలో కొత్తగా 3,797 కరోనా కేసులు, 35మంది మృతి

Corona Cases in AP: ఏపీలో గతంతో పోలిస్తే కరోనా కేసులు బాగా తగ్గాయి.

Arun Chilukuri
Published on: 30 Jun 2021 6:42 PM IST
3,797 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 30 06 2021
X

ఏపీలో కొత్తగా 3,797 కరోనా కేసులు, 35మంది మృతి

Corona Cases in AP: ఏపీలో గతంతో పోలిస్తే కరోనా కేసులు బాగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 97వేల 696 పరీక్షలు చేయగా 3వేల 797 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇక కొత్తగా 35మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దాంతో, రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ‌్య 12వేల 706కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18లక్షల 89వేల 513కి చేరగా ఇప్పటివరకు కోవిడ్‌ నుంచి 18లక్షల 38వేల 469 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 38వేల 338 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

ఇక గత 24గంటల్లో కరోనా మహమ్మారితో రాష్ట్రవ్యాప్తంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఎనిమిది మంది, చిత్తూరులో ఏడుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృత్యువాత పడ్డారు. అనంతపురం, కృష్ణాజిల్లా, కర్నూలులో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోగా గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story