ఏపీలో కొత్తగా 377 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 5 Jan 2021 8:00 PM IST
ఏపీలో కొత్తగా 377 కరోనా పాజిటివ్ కేసులు
X

ఏపీలో కొత్తగా 51వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా 377 కొత్త కేసులు నమోదు కాగా నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,83,587కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 7,122 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 278 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,73,427కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,038 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,20,53,914 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story