ఏపీలో 8లక్షలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 8లక్షల మార్క్‌ను దాటేశాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 8లక్షల 684 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7లక్షల 62వేల 419మంది కోలుకున్నారు.

admin
Updated on: 23 Oct 2020 6:58 PM IST
ఏపీలో 8లక్షలు దాటిన కరోనా కేసులు
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 8లక్షల మార్క్‌ను దాటేశాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 8లక్షల 684 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7లక్షల 62వేల 419మంది కోలుకున్నారు. రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో కేవలం 31వేల 721మంది మాత్రమే వైరస్‌తో పోరాడుతున్నారు. ఇక, గత 24గంటల్లో 80వేల 238మందికి కరోనా పరీక్షలు చేయగా.... 3765మందికి వైరస్ సోకినట్లు తేలింది. అలాగే, ఈరోజు కొత్తగా 20మంది మృత్యువాత పడటంతో.... మృతుల సంఖ్య 6వేల 544కి పెరిగింది. గుంటూరులో నలుగురు మరణించగా, కడప, కృష్ణాలో ముగ్గురు చొప్పున.... అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరిలో ఇద్దరు చొప్పున మృత్యువాత పడ్డారు. అలాగే, కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు.


admin

admin

Next Story