Covid19 Update : ఏపీ మరో 349 కరోనా పాజిటివ్ కేసులు.. ఇద్దరి మృతి

Samba Siva Rao
Updated on: 27 Dec 2020 7:46 PM IST
Covid19 Update : ఏపీ మరో 349 కరోనా పాజిటివ్ కేసులు.. ఇద్దరి మృతి
X

ఏపీలో గడచిన 24 గంటల్లో 46,386 కోవిడ్ టెస్టులు నిర్వహించగా 349 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 105 పాజిటివ్ కేసులు వచ్చాయి. కృష్ణా 67, గుంటూరులో 34, అనంతపురం జిల్లాలో 31 కొత్త కేసులు గుర్తించారు. గడచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. పశ్చిమ గోదావరి 3, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో 8 చొప్పున కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 422 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,81,061 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,70,342 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,625 అని తాజా బులెటిన్ లో వెల్లడించారు. మొత్తం మరణాల సంఖ్య 7,094కి చేరింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story