Corona Cases in AP: ఏపీలో కొత్తగా 3,481 కరోనా కేసులు, 38 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

Arun Chilukuri
Published on: 1 July 2021 5:01 PM IST
3,481 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 01 07 2021
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 3,481 కరోనా కేసులు, 38 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 90 వేల 574 శాంపిల్స్‌ని పరీక్షించగా వారిలో 3 వేల 481 మందికి పాజిటివ్‌గా నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 18 లక్షల 93వేలు దాటినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని మరో 3వేల 963 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 18 లక్షల 42 వేలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల 74 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా కేసులు తగ్గుతున్నా మృతుల సంఖ్య మాత్రం ఆగడం లేదు. గడిచిన 24 గంటల్లో మరో 38 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 12 వేల 744 కి చేరింది. కోవిడ్‌తో కృష్ణాలో ఎనిమిది మంది, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరులో ఐదుగురు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ముగ్గురు, అనంతపురం, కడపలో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు, కర్నూలు, నెల్లూరు, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణాలు సంభవించినట్టు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story