AP Corona Cases: ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు, 12 మంది మృతి

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.

Arun Chilukuri
Published on: 10 April 2021 7:32 PM IST
3,309 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 10th April 2021
X

AP Corona Cases: ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు, 12 మంది మృతి

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24గంటల్లో మూడు వేల 309 మందికి కరోనా సోకింది. ఇక, అదే స్థాయిలోనూ యాక్టివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 740, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 26 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

ఏపీలో ప్రస్తుతం 18 వేల 666 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇక, గడిచిన 24గంటల్లో 12 మంది మృత్యువాత పడగా, మొత్తం మృతుల సంఖ్య 7291 కి చేరింది. చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, విశాఖలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లొ ఒక్కొక్కరు చొప్పున మరణించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story