Corona Cases in AP: ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు

Corona Cases in AP: ఏపీలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 12 Jan 2022 5:07 PM IST
3,205 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 12th January 2022
X

Corona Cases in AP: ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు

Corona Cases in AP: ఏపీలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 41 వేల 954 పరీక్షలు నిర్వహించగా మూడు వేల 205 కొవిడ్ కేసులు నిర్దారణ అయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20 లక్షల 87 వేల 879కి చేరాయి. మొత్తం 20 లక్షల 63 వేల 255 మంది బాధితులు కోలుకోగా తాజాగా 281 మంది కోలుకున్నారు. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 14 వేల 505 కు చేరుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 10,119 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story