Corona Cases in AP: ఏపీలో కొత్తగా 3,166 కరోనా కేసులు, 21 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

Arun Chilukuri
Published on: 7 July 2021 4:44 PM IST
3,166 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 7th July 2021
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 3,166 కరోనా కేసులు, 21 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 83 వేల 885 శాంపిల్స్ సేకరించగా వారిలో 3 వేల 166 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 19 లక్షలు దాటింది. మరోవైపు కరోనా నుంచి కోలుకుని మరో 4 వేల 19 మంది డిశ్చార్జ్ అయ్యారు. దాంతో కోవిడ్‌‌ను జయించిన వారి సంఖ్య 18 లక్షలు దాటింది. తూర్పుగోదావరి జిల్లాలో 664, చిత్తూరులో 337, ప్రకాశం 375 చొప్పున కరోనా కేసులు నమోదు అయ్యినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఒకవైపు కరోనా కేసులు భారీగా తగ్గుతున్నా మృత్యుఘోష ఆగడం లేదు గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో 21 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12 వేల 919కి చేరింది. చిత్తూరులో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, అనంతపురంలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, శ్రీకాకుళం, విశాఖలో ఒక్కరు చొప్పున మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల 356 యాక్టివ్ కేసులున్నట్టు హెల్త్ బులిటెన్‌ లో పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story