ఏపీలో భారీగా పడిపోయిన కరోనా కేసులు!

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 44,935 కరోనా పరీక్షలు నిర్వహించగా, 305 మందికి పాజిటివ్‌గా తేలింది
ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 44,935 కరోనా పరీక్షలు నిర్వహించగా, 305 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 87,5836కి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఇక అటు గడచిన 24 గంటల్లో 541 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీనితో కోలుకున్నవారి సంఖ్య 864049కి చేరుకుంది. ఇక గడచిన 24 గంటల్లో కరోనాతో నెల్లూరులో ఇద్దరు మరణించారు. దీనితో రాష్ట్రంలో మరణాల సంఖ్య 7059 మంది మృతిచెందారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 4728 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా టెస్టుల సంఖ్య 1,08,75,925 కు చేరుకుంది.
#COVIDUpdates: 14/12/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 14, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,72,941 పాజిటివ్ కేసు లకు గాను
*8,61,154 మంది డిశ్చార్జ్ కాగా
*7,059 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,728#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/XTnWgfH00d