Corona Cases in AP: ఏపీలో కొత్తగా 3,042 కరోనా కేసులు, 28 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

Arun Chilukuri
Published on: 6 July 2021 5:57 PM IST
3,042 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 6th July 2021
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 3,042 కరోనా కేసులు, 28 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 88 వేల 378 శాంపిల్స్ సేకరించగా వారిలో 3 వేల 42 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 19 లక్షలు దాటింది. మరోవైపు కరోనా నుంచి కోలుకుని మరో 3 వేల 7వందల 48 మంది డిశ్చార్జ్ అయ్యారు. దాంతో కోవిడ్‌‌ను జయించిన వారి సంఖ్య 18 లక్షలు దాటింది. తూర్పుగోదావరి జిల్లాలో 665, చిత్తూరులో 358, తూర్పుగోదావరి 360, ప్రకాశం 310 చొప్పున కరోనా కేసులు నమోదు అయ్యినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఒకవైపు కరోనా కేసులు భారీగా తగ్గుతున్నా మృత్యుఘోష ఆగడం లేదు గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో 28 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12 వేల 898కి చేరింది. చిత్తూరులో ఏడుగురు, తూర్పుగోదావరి, నెల్లూరులో నలుగురు, కడపలో ముగ్గురు, అనంతపురం, గుంటూరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, కృష్ణ, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖలో ఒక్కరు చొప్పున మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల 230 యాక్టివ్ కేసులున్నట్టు హెల్త్ బులిటెన్‌ లో పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story