Kurnool: నంద్యాల వైఎస్సార్‌నగర్‌ కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

* కలుషిత నీరు తాగి 30 మంది విద్యార్థులకు వాంతులు * వార్డెన్‌ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం

Shilpa
Published on: 26 Nov 2021 7:09 PM IST
30 Students Ill Health After Drinking Contaminated Water in Kasturba School at YSR Nagar Kurnool
X

కర్నూలు(ఫైల్ ఫోటో)

Kurnool: కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్సార్‌ నగర్‌ కస్తూర్బా పాఠశాల హాస్టల్‌లో కలుషిత నీరు తాగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించిన డాక్టర్లు ప్రమాదం ఏం లేదంటూ తిరిగి హాస్టల్‌కు పంపించారు.

వాటర్ శాంపిల్స్‌ సేకరించి, పరీక్షల నిమిత్తం కర్నూలుకు పంపామని, రిపోర్ట్స్ రాగానే సరైన చికిత్స అందిస్తామని చెప్పారు. మరోవైపు వార్డెన్‌ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ పిల్లలకు ఏమైందోనని ఆందోళనకు గురవుతున్నారు.

Shilpa

Shilpa

Next Story