ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

Andhra Pradesh: 30 మంది ఐపీఎస్‌లకు బదిలీలు, పోస్టింగ్‌లు

Jyothi
Published on: 30 Jan 2024 7:35 AM IST
30 IPS Officers Transferred In Andhra Pradesh
X

ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

Andhra Pradesh: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. 30 మంది ఐపీఎస్‌లకు బదిలీలు, పోస్టింగ్‌లు కల్పించారు. APSP అదనపు డీజీగా అతుల్‌ సింగ్‌, రైల్వే పోలీస్‌ అదనపు డీజీగా విశ్వజిత్‌, ఆక్టోపస్‌ ఐజీగా శ్రీకాంత్‌ నియమితులయ్యారు. రోడ్ సేఫ్టీ అథారిటీ ఐజీగానూ శ్రీకాంత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీగా రఘురామిరెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక బోర్డు చైర్మన్‌గా రాజశేఖర్‌బాబు హోంగార్డ్స్‌ ఐజీగానూ రాజశేఖర్‌బాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఐడీ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి, పోలీస్‌ సిబ్బంది వ్యవహారాల ఐజీగా హరికృష్ణ నియమితులయ్యారు.

ఆక్టోపస్‌ డీఐజీగా సెంథిల్‌ కుమార్‌ను నియమించగా...శాంతిభద్రతల డీఐజీగానూ సెంథిల్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పోలీసు శిక్షణ డీఐజీగా రాహుల్‌దేవ్‌ శర్మ, విశాఖ రేంజ్‌ డీఐజీగా విశాల్‌ గున్నీ నియమితులయ్యారు. కర్నూలు రేంజ్‌ డీఐజీగా సీహెచ్‌ విజయరావు, విశాఖ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌గా ఫకీరప్పను నియమించారు. కృష్ణా జిల్లా ఎస్పీగా అద్నాన్‌ నయీం ఆస్మి, ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌ నియమితులయ్యారు.

Jyothi

Jyothi

Next Story