Tirupati: తిరుపతి జూపార్కులోని మూడు పులి పిల్లలకు నామకరణం..

Tirupati: మూడు పులి పిల్లలకు రుద్రమ్మ, అనంత, హరిణిగా పేర్లు

Shekhar G
Published on: 30 July 2023 8:39 AM IST
3 Tiger Cubs At SV Zoo Named As Rudrama Anantha And Harini In Tirupati
X

Tirupati: తిరుపతి జూపార్కులోని మూడు పులి పిల్లలకు నామకరణం.. 

Tirupati: తిరుపతి జూపార్కులోని మూడు పులిపిల్లలకు నామకరణం జరిగింది. నంద్యాల జిల్లా ముసలిమడుగు అటవీ ప్రాంతం నుంచి తీసుకువచ్చిన పులి పిల్లలను తిరుపతి జూలో సంరక్షిస్తున్నారు. తల్లి పులి కనిపించకుండా పోవడంతో నాలుగు పులి పిల్లలను తిరుపతి జంతు ప్రదర్శనశాలకు తీసుకొచ్చి సంరక్షణ చర్యలు చేపట్టారు. నాలుగు పులిపిల్లల్లో ఒక పులిపిల్ల మృత్యువాతపడింది. మిగిలిన మూడు పులి పిల్లలకు తిరుపతి జూ అధికారులు... నామకరణం చేశారు. రుద్రమ్మ, అనంత, హరిణి అని పేర్లు పెట్టారు. పులి పిల్లలకు వేటాడటం నేర్పుతున్నారు. త్వరలోనే అటవీ ప్రాంతంలోకి పులి పిల్లలను స్వేచ్ఛగా వదలనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story