Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,982 కరోనా కేసులు, 27 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2వేల 982 కరోనా కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Published on: 8 July 2021 5:48 PM IST
2,982 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 8th July 2021
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,982 కరోనా కేసులు, 27 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2వేల 982 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 19లక్షల 14వేల 213 మంది వైరస్‌ బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌ బారిన పడి 27 మంది మృతిచెందగా రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 12వేల 946కి చేరింది. ఒక్కరోజులో కరోనా బారి నుండి 3వేల 461 మంది కోలుకున్నారు.

ఇప్పటివరకు 18 లక్షల 69 వేల 417 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 31,850 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,14,213 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,26,99,142 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story