Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,930 కరోనా కేసులు, 36 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.

Arun Chilukuri
Published on: 3 July 2021 6:46 PM IST
2,930 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 03 07 2021
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,930 కరోనా కేసులు, 36 మంది మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 90 వేల 532 శాంపిల్స్‌ని పరీక్షించిస్తే వారిలో 2వేల 930 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 19లక్షలకు చేరువలో ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని మరో 4 వేల 346 మంది రికవరీ అయ్యారు. దీంతో కోవిడ్‌ను జయించిన వారి సంఖ్య 18 లక్షలు దాటినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24గంటల్లో తూర్పుగోదావరిలో 591, చిత్తూరులో 443, ప్రకాశంలో 363, వెస్ట్ గోదావరి 338 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

ఒకవైపు పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నా మరణాలు మాత్రం తగ్గడం లేదు గడిచిన 24గంటల్లో కరోనాతో మరో 36 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 12 వేల 815 కి చేరింది. చిత్తూరులో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, గుంటూరు, కర్నూలు నలుగురు, కడప, ప్రకాశం, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపురం, కృష్ణా, విశాఖలో ఇద్దరు, నెల్లూరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించినట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 35 వేల 871 యాక్టివ్ కేసులున్నట్టు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story