ఏపీలో కొత్తగా 282 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 43వేల పరీక్షలు...
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 43వేల పరీక్షలు నిర్వహించగా 282 కేసులు నిర్ధారణ అయ్యాయ్. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8లక్షళ 80వేలు దాటింది. కొత్తగా ఒకరు వైరస్‌కు బలవగా, మొత్తం మరణాల సంఖ్య 7వేల 92కు పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 442మంది కోలుకోగా మొత్తం డిశ్చార్జిల సంఖ్య 8లక్షల 69వేలు దాటింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3వేల 7వందల యాక్టివ్ కేసులు ఉన్నాయ్. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటివరకు 1,15,74,117 శాంపిల్స్‌ను పరీక్షించారు.
#COVIDUpdates: 26/12/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 26, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,77,817 పాజిటివ్ కేసు లకు గాను
*8,67,025 మంది డిశ్చార్జ్ కాగా
*7,092 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,700#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/egkz3ucizh