Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,672 కరోనా కేసులు.. 18 మరణాలు

Corona Cases in AP: ఏపీలో కొత్తగా రెండు వేల 672 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

Arun Chilukuri
Published on: 17 July 2021 8:12 PM IST
2,672 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 17th July 2021
X

ఏపీలో కొత్తగా 2,672 కరోనా కేసులు.. 18 మరణాలు

Corona Cases in AP: ఏపీలో కొత్తగా రెండు వేల 672 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 19 లక్షల 37 వేల 122 మంది వైరస్ బారీన పడినట్లు రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం మృతుల సంఖ్య 13 వేల 115కి చేరింది.

ప్రస్తుతం రాష్ర్టంలో 25 వేల 41 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 2,467 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,98,966కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 91,594 పరీక్షలు నిర్వహించగా..రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,34,88,031 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story