logo
ఆంధ్రప్రదేశ్

Prisoners Tests Positive for Coronavirus: సెంట్రల్‌ జైలులో 265 మందికి కరోనా!

Prisoners Tests Positive for Coronavirus: సెంట్రల్‌ జైలులో 265 మందికి కరోనా!
X
Highlights

prisoners tests positive for coronavirus: జైలులో ఉన్న ఖైదీలనూ కరోనా మహమ్మారి వదలడం లేదు. రాజమండ్రి సెంట్రల్‌...

prisoners tests positive for coronavirus: జైలులో ఉన్న ఖైదీలనూ కరోనా మహమ్మారి వదలడం లేదు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 3వ తేదీన 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు చేశారు.

రాజమండ్రి సెంట్రల్ జైలులో మొత్తం 1670 ఖైదీలు, 200 మంది సిబ్బంది ఉన్నారు. ఖైదీల్లో 900 మందికి ఇటీవలే కరోనా పరీక్షలు నిర్వహించారు. 900 మందికి నిర్వహించిన పరీక్షల్లో 247 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ నెల ఒకటో తేదీన 75 మందికి పరీక్షలు చేయగా జైల్‌లో విధులు నిర్వహిస్తున్న 24 మంది సిబ్బందికి, 9 మంది ఖైదీలకు, 2వ తేదీన 64 మందికి పరీక్షలు చేయగా 9 మంది ఖైదీలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాజిటివ్‌ వచ్చిన జైల్‌ సిబ్బంది 24 మందిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో జైల్లో మూలాఖత్‌లను అధికారులు నిలిపివేశారు.

Web Title265 prisoners test positive for coronavirus in Rajahmundry Central Jail
Next Story