Corona Cases in AP: కొత్తగా 2,620 మందికి కరోనా పాజిటివ్‌

Corona Cases in AP: గడిచిన 24గంటల్లో 44 మంది మృతి * రాష్ట్రంలో 18,53,183కి చేరిన పాజిటివ్‌ కేసులు

Sandeep Eggoju
Updated on: 21 Jun 2021 6:30 PM IST
2,620 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 21 06 2021
X
Representational Image

Corona Cases in AP: ఏపీలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2వేల 620 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇక.. గడిచిన 24గంటల్లో కోవిడ్‌ బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా 44 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 18లక్షల 53వేల 183 మందికి కరోనా సోకగా.. వైరస్‌ నుంచి కోలుకుని 17లక్షల 82వేల 680 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 12వేల 363 మంది మృతిచెందగా.. ఏపీలో ప్రస్తుతం 58వేల 140 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరోవైపు.. రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల సంఖ్య కాస్త.. ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో వైరస్‌ సోకి 44 మంది మృతి చెందగా.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 10 మంది మృత్యువాత పడ్డారు. గుంటూరు, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు మృతిచెందారు. కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. ఇక.. కృష్ణాజిల్లాలో ఇద్దరు, కడప, నెల్లూరు, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story