AP Corona Cases: ఏపీలో కొత్తగా 2,558 కరోనా కేసులు, 6 మంది మృతి

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.

Arun Chilukuri
Published on: 8 April 2021 4:55 PM IST
2,558 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 8th April 2021
X

AP Corona Cases: ఏపీలో కొత్తగా 2,558 కరోనా కేసులు, 6 మంది మృతి

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈరోజు కూడా కరోనా కేసులు రెండు వేలు దాటేశాయి. గడిచిన 24గంటల్లో 2558మందికి కరోనా సోకింది. ఇక, అదే స్థాయిలోనూ యాక్టివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో ప్రస్తుతం 14,913 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇక, గడిచిన 24గంటల్లో ఆరుగురు మృత్యువాత పడగా, మొత్తం మృతుల సంఖ‌్య 7268కి చేరింది. గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇక, అనంతపురంలో 131, చిత్తూరులో 465, తూర్పుగోదావరిలో 58, గుంటూరులో 399, కడపలో 94, కృష్ణాలో 152, కర్నూలులో 344, నెల్లూరులో 204, ప్రకాశంలో 153, శ్రీకాకుళంలో 185, విశాఖలో 290, విజయనగరంలో 46, పశ్చిమగోదావరిలో 37 కేసులు నమోదయ్యాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story