AP Corona Cases: ఏపీలో కరోనా మృత్యుభేరి..ఒక్కరోజులో 101 మంది మృతి

AP Corona Cases: ఏపీలో క‌రోనా వైర‌స్ మరణమృదంగం మోగిస్తుందింది.

Samba Siva Rao
Published on: 16 May 2021 6:50 PM IST
corona casees in AP
X

కొరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం 

AP Corona Cases: ఏపీలో క‌రోనా వైర‌స్ మరణమృదంగం మోగిస్తుందింది. రోజురోజుకు క‌రోనా బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. మ‌ర‌ణాల సంఖ్య వంద మార్క్ దాటింది. గత 24 గంటల్లో ఏపీలో 94,550 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 24,171మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మ‌రో 101 మంది మరణించడంతో ఈ వైరస్ తీవ్రతను చాటుతోంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 14 మంది మృతి చెంద‌గా., విశాఖ జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది మ‌ర‌ణించారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివవరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 9,372కి పెరిగింది.

ఏపీలో ఇప్పటివరకు 14,35,491 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 12,15,683 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,10,436 మంది చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 3,356 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 2,885 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 2,876 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2,426 కేసులు, విశాఖ జిల్లాలో 2,041 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 21,101 మంది కరోనా నుంచి కోలుకున్నారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story