AP Corona Cases: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.

Arun Chilukuri
Published on: 7 April 2021 6:27 PM IST
2,331 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 7th April 2021
X

AP Corona Cases: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. వారంరోజులుగా ప్రతిరోజూ సుమారు వెయ్యి కేసులు నమోదైతే ఈరోజు ఏకంగా రెండు వేలు దాటేశాయి. గడిచిన 24గంటల్లో 2331మందికి కరోనా సోకింది. ఇక, అదే స్థాయిలోనూ యాక్టివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో ప్రస్తుతం 13,276 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

ఇక, గడిచిన 24గంటల్లో 11మంది మృత్యువాత పడగా, మొత్తం మృతుల సంఖ‌్య 7262కి చేరింది. చిత్తూరు జిల్లాలో నలుగురు కర్నూలులో ఇద్దరు మరణించారు. అలాగే, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. ఇక, అనంతపురంలో 202, చిత్తూరులో 296, తూర్పుగోదావరిలో 29, గుంటూరులో 368, కడపలో 149, కృష్ణాలో 327, కర్నూలులో 176, నెల్లూరులో 186, ప్రకాశంలో 110, శ్రీకాకుళంలో 123, విశాఖలో 298, విజయనగరంలో 47, పశ్చిమగోదావరిలో 20 కేసులు నమోదయ్యాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story