CoronaVirus Update: ఏపీ కొత్తగా 227 మందికి కరోనా పాజిటివ్

ఏపీ కొత్తగా 227 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Samba Siva Rao
Published on: 10 Jan 2021 7:31 PM IST
CoronaVirus Update:  ఏపీ కొత్తగా 227 మందికి కరోనా పాజిటివ్
X

ఏపీ కొత్తగా 227 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో విశాఖ జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో 50,027 కరోనా టెస్టులు నిర్వహించగా 227 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 50 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 38, కర్నూలు జిల్లాలో 23 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో 8, నెల్లూరు జిల్లాలో 7, శ్రీకాకుళం జిల్లాలో 7, కేసులు వచ్చాయి. తాజాగా 289 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,129కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,84,916 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,75,243 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,544 మందికి చికిత్స పొందుతున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story