AP Corona Cases: ఏపీలో కరోనా మృత్యుభేరి ..114 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా వైర‌స్ మ‌ర‌ణమృదంగం మోగిస్తుంది

Samba Siva Rao
Published on: 20 May 2021 6:39 PM IST
Corona Virus Positive Cases Andhra Pradesh
X

క‌రో్నా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

AP Corona Cases: ఏపీలో కరోనా వైర‌స్ మ‌ర‌ణమృదంగం మోగిస్తుంది. గ‌డిచిన 24 గంట్ల‌లో కరోనా బారిన ప‌డి 114 మంది మృత్యువాత పడ్డారు.. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 9,800కి చేరింది. గ‌త 24 గంట‌ల్లో అన్ని జిల్లాల్లో కలిపి 1,01,281 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,610 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అదే సమయంలో 23,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 15,21,142 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 13,02,208 మంది పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,09,134 మంది చికిత్స పొందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 3,602 కేసులు, చిత్తూరు జిల్లాలో 3,185 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 17 మంది, చిత్తూరు జిల్లాలో 15 మంది మరణించారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story