AP Corona Cases: ఏపీలో ఆగ‌ని క‌రోనా విల‌యం.. 98మంది మృతి

AP Corona Cases: ఏపీలో క‌రోనా వైర‌స్ విల‌యతాండ‌వం చేస్తుంది.

Samba Siva Rao
Published on: 15 May 2021 7:09 PM IST
AP Corona Cases
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

AP Corona Cases: ఏపీలో క‌రోనా వైర‌స్ విల‌యతాండ‌వం చేస్తుంది. రోజురోజుకు క‌రోనా బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. గత 24 గంటల్లో ఏపీలో 89,535 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 22,517మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మ‌రో 98 మంది మరణించడంతో ఈ వైరస్ తీవ్రతను చాటుతోంది. అనంతపురం జిల్లాలో 12 మంది, నెల్లూరు జిల్లాలో 11, తూర్పుగోదావరి 10, విశాఖ 9, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 7 మంది చొప్పున మృత్యువాత పడ్డారు. అత్యాల్పంగా కడ‌ప‌లో 2 మ‌ర‌ణించారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 9,369కి పెరిగింది.

అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 3,432 కొత్త కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లోనూ కరోనా బీభత్సం కనిపించింది. అదే సమయంలో 18,739 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 14,11,320 పాజిటివ్ కేసులు నమోదు కాగా,11,94,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 2,03,787 మంది చికిత్స పొందుతున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story