AP Corona Cases: క‌రోనా క‌ల్లోలం..రికార్డు స్థాయిలో కేసులు

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్ర‌ళ‌యం సృష్టిస్తోంది.

Samba Siva Rao
Updated on: 13 May 2021 6:23 PM IST
corona cases in Ap
X

ఏపీలో క‌రోనా కేసులు

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్ర‌ళ‌యం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గ‌డ‌చిన 24 గంటల్లో ఏకంగా 22,399 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇదే సమయంలో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,63,890 కేసులు నమోదు కాగా..11,53,771 మంది కోలుకున్నారు. మ‌రో 9,077 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మృతి చెందారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 2,01,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 11 మంది ప్రాణాలు విడిచారు. అత్య‌ల్పంగా అనంత‌పురం జిల్లాలో ముగ్గురు ఈ మ‌హ‌మ్మ‌రి బారిన ప‌డి మ‌ర‌ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,638 మంది కోలుకొని డిశ్ఛార్ అయ్యారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story