ఏపీలో కొత్తగా 2,237 కరోనా కేసులు, 12 మరణాలు

ఏపీలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి.. తాజాగా గడిచిన 24 గంటల్లో 76,663 కరోనా టెస్టులు చేయగా 2,237 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Krishna
Published on: 8 Nov 2020 7:10 PM IST
ఏపీలో కొత్తగా 2,237 కరోనా కేసులు, 12 మరణాలు
X

ఏపీలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి.. తాజాగా గడిచిన 24 గంటల్లో 76,663 కరోనా టెస్టులు చేయగా 2,237 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,40,072 కి చేరుకుంది. అయితే ఇందులో 21,403 యాక్టివ్ కేసులుండగా 8,11,878 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 2,256 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 12 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,791కి చేరుకుంది.

కరోనా వలన కృష్ణా జిల్లాలో 3, చిత్తూరులో 2, విశాఖపట్నంలో 2, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 109, చిత్తూరులో 329, ఈస్ట్ గోదావరిలో 188, గుంటూరులో 364, కడపలో 84, కృష్ణాలో 277, కర్నూల్ లో 24, నెల్లూరులో 88, ప్రకాశంలో 83, శ్రీకాకుళం 117, విశాఖపట్నం 108, విజయనగరం 87, వెస్ట్ గోదావరి 379 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 86,63,975 కరోనా టెస్టులు నిర్వహించారు.


Krishna

Krishna

Next Story