Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,224 కరోనా కేసులు నమోదు

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2వేల 224కరోనా కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Updated on: 28 Jun 2021 5:06 PM IST
2,224 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 28 06 2021
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,224 కరోనా కేసులు నమోదు

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2వేల 224 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 31 మంది మృతి చెందారు. ఏపీలో పాజిటివ్‌ కేసులు 18 లక్షల 79 వేల 201కి చేరాయి. ఏపీలో కరోనాతో ఇప్పటి వరకు 12వేల630 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 18లక్షల 24వేల 319 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 42వేల 252 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఏపీలో కేసులు కంట్రోల్‌ అవుతున్నా మరణాలు మాత్రం ఆగడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 31 మంది కరోనా కాటుకు బలయ్యారు. అత్యధికంగా చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనా పేషెంట్లు చనిపోయారు. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story