AP Corona Cases: ఏపీలో కరోనా విలయతాండవం..96 మంది మృతి

AP Corona Cases:ఏపీలో క‌రోనా వైర‌స్ విల‌యతాండ‌వం చేస్తుంది.

Samba Siva Rao
Updated on: 14 May 2021 7:13 PM IST
Corona Virus Positive Cases Ap
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

AP Corona Cases: ఏపీలో క‌రోనా వైర‌స్ విల‌యతాండ‌వం చేస్తుంది. రోజురోజుకు క‌రోనా బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. గత 24 గంటల్లో ఏపీలో 89,087 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,018 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.96 మంది మరణించడంతో ఈ వైరస్ తీవ్రతను చాటుతోంది. అనంతపురం జిల్లాలో 11 మంది, తూర్పుగోదావరి, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10 మంది చొప్పున మృత్యువాత పడ్డారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 9,173కి పెరిగింది.

అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 3,432 కొత్త కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లోనూ కరోనా బీభత్సం కనిపించింది. అదే సమయంలో 19,177 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 13,88,803 పాజిటివ్ కేసులు నమోదు కాగా,11,75,843 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 2,03,787 మంది చికిత్స పొందుతున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story