Vizianagaram: పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. 22 మందికి గాయాలు

Vizianagaram: విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 10 Dec 2021 10:16 AM IST
22 People Injured at Tractor Accident in Vizianagaram
X

Vizianagaram: పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. 22 మందికి గాయాలు

Vizianagaram: విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బొండపల్లి మండలం చామలవలస వద్ద ట్రాక్టర్‌ బోల్తా కొట్టిన ఘటనలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరూ మెంటాడ మండలం చింతాడవలసకు చెందిన వారిగా గుర్తించారు. వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story