AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభన..89 మంది మృతి

AP Corona Cases: ప్రస్తుతం రాష్ట్రంలో 1,97,370 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Samba Siva Rao
Updated on: 12 May 2021 8:18 PM IST
21452 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 12 05 2021
X

కరోనా టెస్ట్ (ఫైల్ ఇమేజ్)

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్ర‌ళ‌యం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గ‌డ‌చిన 24 గంటల్లో ఏకంగా 21,452 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇదే సమయంలో 89 ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,44,386 కేసులు నమోదు కాగా..11,38,028 మంది కోలుకున్నారు. మ‌రో 8,988 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,97,370 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

విశాఖ జిల్లాలో అత్యధికంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కేసులు (2,927) కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 19,095 మంది కోలుకున్నారు. యాక్టీవ్ కేసులు పెరిగిపోవ‌డంతో ఆస్ప‌త్రుల్లో బెడ్లు దొర‌క‌ని పరిస్థ‌తి ఏర్పడింది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story