ఏపీలో కొత్తగా 212 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 212 కరోనా కేసులు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 37వేల పరీక్షలు నిర్వహించగా 212 కేసులు నిర్ధారణ అయ్యాయ్. దీంతో...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 37వేల పరీక్షలు నిర్వహించగా 212 కేసులు నిర్ధారణ అయ్యాయ్. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8లక్షళ 78వేలు దాటింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 7వేల 98కు పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 410మంది కోలుకోగా మొత్తం డిశ్చార్జిల సంఖ్య 8లక్షల 67వేలు దాటింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3వేల 4వందల యాక్టివ్ కేసులు ఉన్నాయ్. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటివరకు 1,16,57,884 శాంపిల్స్‌ను పరీక్షించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories