AP News: ఏపీలో 21 మంది ఐఏఎస్‌ల బదిలీ

21 Ias Officers Transfered In Andhra Pradesh
x

AP News: ఏపీలో 21 మంది ఐఏఎస్‌ల బదిలీ

Highlights

AP News: సర్వే సెటిల్‌మెంట్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌గా గోవిందరావు

AP News: ఏపీలో 21 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఇందులో పలువురు కలెక్టర్లు కూడా ఉన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ బాలాజీరావు మున్సిపల్ అ‍డ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. అలాగే నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీ.. శ్రీకాకుళం కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఇక, తిరుపతి కలెక్టర్ గా లక్ష్మి షా బదిలీ అయ్యారు. ఎన్నికల వేళ భారీగా 21 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన ఐఏఎస్‌ అధికారులు వీళ్లే..

☛ మున్సిపల్‌ శాఖ కమిషనర్‌గా బాలాజీ రావ్‌

☛ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా మంజీర్‌ జిలానీ

☛ తిరుపతి జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీషా

☛ నంద్యాల జిల్లా కలెక్టర్‌గా కె.శ్రీనివాసులు

☛ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా వెంకటరమణారెడ్డి

☛ అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా అభిశక్త్‌ కిశోర్‌

☛ పార్వతీపురం జిల్లా మన్యం జాయింట్‌ కలెక్టర్‌గా బి.ఆర్‌.అంబేడ్కర్‌

☛ ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా రోణంకి గోపాలకృష్ణ

☛ కాకినాడ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ప్రవీణ్‌ ఆదిత్య

☛ విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా కొల్లాబత్తుల కార్తిక్‌

☛ అల్లూరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా భావన

☛ నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఆదర్శ్‌ రాజీంద్రన్‌

☛ ఏపీయూఎప్‌ఐడీసీ ఎండీగా హరిత

☛ పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రిటేర్‌గా ఇల్లకియా

☛ సర్వే సెటిల్‌మెంట్‌ అడిషనల్‌ డైరెక్టర్‌గా గోవిందరావు

☛ శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా తమీమ్‌ అన్సారియా

☛ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా రోణంకి కూర్మనాథ్‌

☛ జీవీఎంసీ అడిషనల్‌ కమిషనర్‌గా విశ్వనాథన్‌

☛ విశాఖ జాయింట్‌ కలెక్టర్‌గా మయూర్‌ అశోక్‌

Show Full Article
Print Article
Next Story
More Stories