AP Corona Cases: కొత్తగా 20,937మందికి పాజిటివ్..ఆ జిల్లాలోనే 3వేల కేసులు

Samba Siva Rao
Updated on: 21 May 2021 6:45 PM IST
Corona Virus Positive Cases AP
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా విజృంభ‌న కొన‌సాగుతుంది. గడచిన 24 గంటల్లో 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,937 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 104 మంది క‌రోనా వైర‌స్ బారిన ప‌డి మరణించారు. ఇక అదే సమయంలో 20,811 మంది కరోనా నుంచి కొలుకొని డిశార్చ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 9,904కి పెరిగింది.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 15,42,079 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 13,23,019 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 2,09,156 మంది చికిత్స పొందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 3,475 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఉన్న చిత్తూరు జిల్లాలో 3,063 కేసులు గుర్తించారు. అత్య‌ధికంగా చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృత్యువాతపడ్డారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story