AP Corona Cases: కరోనా కరళ నృత్యం..గత 24 గంటల్లో 96మంది మృతి

AP Corona Cases: ఏపీలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది.

Samba Siva Rao
Updated on: 8 May 2021 6:30 PM IST
corona cases In Ap
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

AP Corona Cases: ఏపీలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గ‌త నాలుగు రోజులగా 20వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. శుక్రవారం క‌రోనా వైరుస్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు క‌నిపించాయి. అయితే, గత 24 గంటల్లో మళ్లీ 20వేల మందికి పైగా కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. మొత్తం 1,10,571 శాంపిల్స్‌ పరీక్షించగా, 20,065మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. పాజిటివిటీ రేటు 19.75శాతం ఉండగా, అత్యధికంగా 96మంది మృతి చెందినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 7,065 ఐసీయూ పడకలు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పటికే 6,300లకు పైగా పడకలు కరోనా బాధితులతో నిండిపోయానని వివరించారు.చిత్తూరులో అత్యధికంగా 2,269 కరోనా బారిన పడ్డారని, ఆ తర్వాత తూర్పుగోదావరి 2,370, విశాఖ 2525లలో అత్యధిక కేసులు నమోదైనట్లు వివరించారు. ఇక గత 24 గంటల్లో పశ్చిమగోదావరిలో 14మంది చనిపోగా, విశాఖలో 12మంది మృత్యువాతపడ్డారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story