AP Corona Cases: ఏపీలో కరోనా మరణమృదంగం..24 గంటల్లో 118 మంది మృతి

AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. రోజురోజుకు కేసుల సంఖ్య పేరిగిపోతుంది.

Samba Siva Rao
Published on: 22 May 2021 6:57 PM IST
AP Corona Cases
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. రోజురోజుకు కేసుల సంఖ్య పేరిగిపోతుంది. మ‌రోవైపు మ‌ర‌ణాల సంఖ్య కూడా వంద‌కు తక్కువ‌గా రావ‌డం లేదు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో వందకు పైగా మరణాలు సంభవించాయి. ఒక్కరోజులో 118 మంది మృత్యువాతపడ్డారు. గ‌డిచిన 24 గంటల్లో 90,609 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 19,981 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 10 వేలు దాటింది. తాజా మరణాలతో కలిపి 10,022గా నమోదైంది.

తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 18,336 మంది కోలుకున్నారు. ఇంకా 2,10,683 మందికి చికిత్స కొనసాగుతోంది.ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,62,060కి చేరింది. 13,41,355 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది, చిత్తూరు జిల్లాలో 14 మంది మరణించారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story