AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,941 కరోనా కేసులు, 7 మంది మృతి

Andhra Pradesh: ఏపీలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది.

Arun Chilukuri
Updated on: 6 April 2021 5:48 PM IST
1,941 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 6th April 2021
X

కరోనా ఫైల్ ఇమేజ్ 

AP Corona Cases: ఏపీలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 19 వందల 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షల 10వేల 943కు చేరింది.

గడిచిన 24గంటల్లో కరోనా బారిన పడి ఏడుగురు మృతి చెందారు. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో మొత్తం 7వేల 251 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. కరోనా బారి నుంచి కోలుకొని 835 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11 వేల 809 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story