AP Corona Cases: ఏపీలో కొత్తగా 18,767 కోవిడ్ కేసులు

AP Corona Cases: ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా రాష్ట్రంలో 18 వేల 767 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Published on: 23 May 2021 5:38 PM IST
Today Corona Cases in Andhra Pradesh
X

క‌రోనా వైర‌స్(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )

AP Corona Cases: ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా రాష్ట్రంలో 18 వేల 767 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 104 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షల 80 వేల 827కు చేరగా ఇప్పటివరకు 10 వేల 126 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 13 లక్షల 61 వేల మంది మహమ్మారి నుంచి కోలుకోగా ప్రస్తుతం 2 లక్షల 9 వేల 237 యాక్టివ్ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2 వేల 887 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 2 వేల 3 వందలకు పైగా కేసులు నమోదవగా పశ్చిమ గోదావరి జిల్లాలో 19 వందల 72.. అనంతపురంలో 18 వందల 46.. విశాఖపట్నంలో 16 వందల 68 కొత్త కేసులొచ్చాయి. ఇక తాజా మరణాల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది విజయనగరంలో 11 మంది మృత్యువాత పడ్డారు. ఇక విశాఖపట్నంలో 9 మంది చనిపోగా అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూల్ జిల్లాలో 8 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story